అక్షర న్యూస్ : కొమురవెల్లి టెంపుల్ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈఓ శ్రీనివాస్ సూపరిండెంట్ శ్రీరామ్, రవికుమార్, వీరేశలింగం,
గార్లు ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్, అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, గార్లను కలసి మహా ప్రసాదం అందజేసి డిసెంబర్ 29 నాడు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం సందర్భంగా తీసుకోవలసిన ముందస్తు చర్యల గురించి మేడమ్ గారితో చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ టెంపుల్ పరిసర ప్రాంతాలలో పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే కొమురవెల్లి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.