అక్షర న్యూస్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నేత్రువ్వంలో నవంబర్ 27″28వ తేదీలలో కరీంనగర్ నుండి వేములవాడ వరకు జరిగే మహా పాదయాత్ర లో కరీంనగర్ జిల్లా అలాగే వేములవాడ లో ఉన్న మలిదశ ఉద్యమకారులు.
అలాగే వివిధ జిల్లాల ఉద్యమకారులు మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ,ఈ మహా పాదయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తున్న.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కొత్వల్ దయానంద్ గారు మరియు డాక్టర్ రొండా మాలరెడ్డి గారు,డాక్టర్ పెంటమ్ స్వామి గారు జరిగిన మీడియా కార్యక్రమ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సోదరి సోదరమణులందరికీ పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో ఈ మహాపాదయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మనవి చేయడం జరిగింది.