అక్షర న్యూస్ :చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో భాగంగా చేర్యాల పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు మరియు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి..
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఏఏంసి చైర్మన్ నల్ల నాగుల శ్వేత, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ఎంపిడిఓ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
ఇదే వేదిక మీద 6 నెలల క్రితం ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ చేసుకున్నాం అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ద్వారా అందరూ లబ్ది పొందుతున్నారు.
జిల్లాలో 12500 ఇండ్లు మంజూరు కాగా 9500 గ్రౌండింగ్ అయ్యాయని ఇప్పటి వరకు 137 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.
రేషన్ కార్డులు 26721 కొత్త రేషన్ కార్డులు మరియు 74386 మంది సభ్యులను పాత రేషన్ కార్డులలో చేర్చడం జరిగింది. రేషన్ కార్డు దారులకు 441 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తుంది.
మహాలక్షి కింద 1,79,834 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు 45 కోట్ల 65 లక్షలు ఖాతాల్లో జమ చేసింది.
గృహ జ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 2,06,354 గృహాలకు 196 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యుత్ శాఖకు అందించింది.
రైతు భరోసా పథకం కింద 3,20,379 రైతులకు 355 కోట్ల రూపాయలు మంజూరు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 7కోట్ల 20 లక్షల మంది మహిళలు ప్రయాణానికి 240 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి అందివ్వడం జరిగింది.
ఇందిరా మహిళ శక్తి పథకం కింద ఇదివరకే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చీరల పంపిణీ చేసుకున్నాం నాణ్యమైన చీరలు కావున తయారీలో ఆలస్యం వల్ల ఈరోజు అర్బన్ ప్రాంతాల్లో మహిళలకు 4 మున్సిపాలిటీల్లో
11000 పైగా మహిళలకు చీరల పంపిణీ గ్రూప్ లో ఉన్నవారికే కాకుండా 18 సంవత్సరాల పై బడిన ప్రతి మహిళలకు అందించడం జరుగుతుంది.
వడ్డీలేని రుణాలు పట్టణాల్లో 1058 స్వయం సహాయక సంఘాల కు 3 కోట్ల 74 లక్షలు సంఘాలకు వడ్డీలేని రుణాలు అందివ్వడం జరిగిందని తెలిపారు.
అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన-మెప్మా చేర్యాల పట్టణంలో 49 స్వయం సహాయక సంఘాలకు 10,05,977 రూపాయల చెక్కును పంపిణీ చేశారు.



