అక్షర న్యూస్ :వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఈ నెల 22న దుబ్బాకలో నిర్వహిస్తున్నట్లు ఎస్.ఎస్. వై. బ్రహ్మోపదేశకులు శ్రీ దయాకర్ గురూజీ తెలిపారు.
మానవునిలో ఉత్తమమైన ఆలోచనలు, సంస్కారవంతమైన జీవన విధానం అలవడే విధంగా విద్యార్థి దశ నుంచే “ధర్మ బీజాలు” నాటాలని, అందుకు భగవద్గీత పారాయణం, యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం, గాయత్రి మంత్రోపదేశం, క్రమశిక్షణ ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. మతాలకు, కులాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా, గురుపరంపర ఆశీర్వాదoతో వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా ఈ సాధన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మనిషి ప్రజ్ఞా మట్టాలలో ఎదగడం ద్వారా ధర్మం సహజంగానే ఆచరించబడుతున్నారు. పరీక్షలు అనగానే విద్యార్థులు భయాందోళనలకు, ఒత్తిడికి, అనారోగ్యాలకు గురికావడం వంటి సమస్యల నుంచి బయటపడటానికి, అన్ని వర్గాల విద్యార్థులకు “ఉపనయనం సంస్కార దీక్ష” 5 నుండి 9 వ తరగతి విద్యార్థులకు సాధన, మరియు 8,9,10 విద్యార్థులకు 100% మెమొరీ, మార్క్స్ సాధించే శిక్షణ 18 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు residential క్యాంపు ద్వారా ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ఋషి ప్రభాకర్ విద్యా కేంద్ర మహా ఆచార్య శ్రీ చైతన్య కైకినీజీ మార్గదర్శనంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీ దయాకర్ గురూజీ అన్నారు. ఇందుకోసం దుబ్బాక మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన మూడవ తరగతి నుంచి 9వ తరగతి వరకు సుమారు 4000 మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారు, ఫంక్షన్ హాల్ వేదికతోపాటు, విద్యార్థులకు అన్న ప్రసాదం , మైక్ సెట్, విద్యుత్ సదుపాయం కూడా సమకూరుస్తున్నారన్నారు. దాంతో పాటు 700 శ్లోకాలు, అర్థ తాత్పర్యాలతో కూడిన భగవద్గీత పుస్తకాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తామన్నారు. భగవద్గీత పుస్తకాలను పలువురు దాతలు సమకూరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక ఎంపీడీవో భాస్కర శర్మ, ఎం ఈ ఓ ప్రభుదాస్ హాజరవుతారన్నారు. కాగా కార్యక్రమ విజయవంతానికి అందరూ విరాళాల ద్వారా సహకరించాలని దయాకర్ గురూజీ 8919583568 కోరారు.
