అక్షర న్యూస్:దుబ్బాకలో విద్యార్థులతో భగవద్గీత సామూహిక పారాయణం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి సిద్ధ సమాధి యోగ బ్రహ్మోపదేశకులు దయాకర్ జీ గారు.., “మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి(యోగము )లో జీవించాలనుకుంటున్నారా? ,”దేహం కడకు అగ్ని పాలు
వస్త్రం కాటి కాపరి పాలు
అన్నం ముద్ద కాకి పాలు
మీరు ఆచరించిన ధర్మమే నీ పాలు…ప్రార్థన, గురుపూజ, ” 3999″ వేల మంది విద్యార్థులతో సామూహిక సంపూర్ణ భగవద్గీత శ్లోక పారాయణం, ” +రెండు సార్లు 10 నిముషాల ధ్యానము, విశ్వ శాంతి ప్రార్థన, ప్రసాదం వితరణ. ఏర్పాటు చేసే ఇట్టి మహత్కార్యాన్ని భగవదాజ్ఞగా భావించి, నవవిధ భక్తితో నిర్వహించడానికి ఉత్సాహంగా దాతలు ముందుకు వచ్చారు అని మిమ్మల్ని సహృదయంతో విద్యార్థులతో పాటుగా భాగం వహించడానికి ఆహ్వానిస్తున్నాము. ” శ్రద్దావాన్ లభతే జ్ఞానం “
( శ్రద్ధ + నిష్ఠ ఉన్న వారికే విద్య లభిస్తుంది).3 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు తెలుగు చదవడం వచ్చిన విద్యార్థులు భాగం వహించగలరు. 22 గురువారం, జనవరి. ఉదయం 9.30 నుండి 1.30 వరకు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది..స్థలం : శ్రీ రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్, దుబ్బాక.
ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు ప్రయోజనాలు : శ్రవణం, పఠనం, స్పష్టంగా మాట్లాడగలగడంలలో మంచి ప్రగతి + ఆధ్యాత్మిక అభివృద్ధి + వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. దైర్యం, జ్ఞాపకశక్తి, బుద్ది శక్తి పెరుగుతుంది. పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మధ్య ప్రేమ, విశ్వాసాలు పెరుగుతాయి. ఎంతో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యం, ఆనందం, సకారాత్మక ఆలోచనలు మెరుగవుతాయి.విద్యార్థులకు చిన్న వయసులోనే గురుపరంపర ఆశీస్సులు లభిస్తాయి.ప్రతి పాఠశాల విద్యార్థి విధిగా స్కూల్ యూనిఫామ్, జతలో వాటర్ బాటిల్ తో పాటుగా భాగం వహించాలి. షూస్ హాల్ బయట వరుసలలో వదలాలి. నిర్దేశించిన ప్రదేశంలో వరుసలలో కూర్చోవాలి. ప్రతి స్కూల్ నుండి ఎస్కార్ట్ ఉపాధ్యాయులు దారిలో క్రమశిక్షణతో, ప్రేమతో జతలో తోడుగా తీసుకొని రావాలి. ప్రతి విద్యార్థికి ఉచితంగా భగవద్గీత గ్రంథము, ప్రసాదము ఇవ్వబడుతుంది. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వేదికపై సత్కరించుకునే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థి జీవితములో ఈ కార్యక్రమము ఒక దివ్య, మధుర అనుభూతిగా ఉండేలా ప్రతి ఒక్కరమూ బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా, గౌరవపూర్వకంగా నిలబడి, ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిద్దాము.కార్యక్రమానికి ఇంకా 2,3 రోజులు సమయం ఉన్నందున, అప్పటివరకు మీ పాఠశాల క్లాసువైస్ వ్వాట్సాప్ గ్రూపులో లిరిక్స్ ఉన్న లింక్ను ఇవాలే పంపడం వల్ల ఇంటిదగ్గర పిల్లలు సెలవులలో ఆడుతూ పాడుతూ, ఏ పని చేస్తున్నా శ్రవణం చేయగలుగుతారు. టెక్నాలజీ ని సకారాత్మాకంగా ఉపయోగించడం కూడా అలవాటు అవుతుంది. ముఖ్య గమనిక : ” ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చు దుబ్బాకలోనే భిక్షాటన ద్వారా సంగ్రహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించదలచిన దాతలు పది భగవద్గీత పుస్తకాలకు 330 రూపాయలు పై నెంబర్ కు పంపి, స్క్రీన్ షాట్, మీ పేరును వ్వాట్సాప్ లో పంపగలరు. సదా జ్ఞాన దేవత సరస్వతి మాత సేవలో, గురుపరంపరకు శరణాగతిలో, ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్ములను ప్రార్థిస్తూ దయాకర్ జీ, 8919583568. సిద్ధ సమాధి యోగ బ్రహ్మోపదేశకులు.

