• Thu. Apr 30th, 2026

అక్షర న్యూస్: పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తా..!

Bypentam swamy

Mar 9, 2026

అక్షర న్యూస్: పదవి ఉన్నా లేకున్నా నా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, ప్రజలే నా దేవుళ్ళని వారికి ఎలాంటి ఆపతి వచ్చినా నాకు తెలియజేస్తే క్షణాల్లో స్పందిస్తానని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ తెలిపారు.సోమవారం రోజున 17 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ వార్డు ప్రజలతో కలిసి వార్డులో పర్యటించారు.అనంతరం వార్డులో తిరుగుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కంచర్ల శివకుమార్ మాట్లాడుతూ,జీవితంలో గెలుపు, ఓటములు సాధ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస్సు వంచి అంగీకరిస్తానని కంచర్ల శివకుమార్ తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం రాత్రినక, పగలనక కష్టపడి పని చేస్తానని కంచర్ల శివకుమార్ తెలిపారు.వార్డు ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన తన దృష్టికి తెస్తే తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ తెలిపారు.

అక్షర న్యూస్ : RTC సమ్మె.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్

దుబ్బాక మున్సిపాలిటీలో 17వ వార్డును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని 17వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కంచర్ల శివకుమార్ పేర్కొన్నారు.వార్డులో నెలకొన్న సమస్యల్లో భాగంగా మురికి కాలువల పరిశుభ్రత, పిచ్చిముక్కల తొలగింపు కార్యక్రమంలో భాగంగా శివకుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ, గత పాలకుల వల్లే 17వ వార్డు నిర్లక్ష్యానికి గురైందని వార్డుకు సంబంధించిన నిధులు అవకతవకలు జరిగి సిసి రోడ్లు,మురికి కాలువలు నాణ్యత లోపంతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. గత పాలకులు డబ్బులు కూడా పెట్టుకోవడమే తప్ప చేసిందేమీ లేదని దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు..

అక్షర న్యూస్ : RTC సమ్మె.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవర్..