అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంగళవారం, శుక్రవారం రోజున పొడి చెత్త సేకరణ మరియు మిగతా రోజులలో తడి, హానికర చెత్త సేకరణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను సిద్దిపేట పురపాలక సంఘానికి ITC WOW ఈశ్రీ ఫౌండేషన్ CSR (కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వార ISRC (ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్) అవార్డును కమిషనర్ అశ్రిత్ కుమార్ గారికి అందజేయడం జరిగింది.గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.
✓ఇట్టి అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి దశలో ఉన్న పిల్లలకు ప్రతి ఇంటి నుంచి వెలుపడే వ్యర్ధాలను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేయు విధానాన్ని అవగాహన కల్పించడం మరియు పొడి చెత్తను పునర్వినియోగం చేయడం ద్వారా లాభాలను వివరించడం. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా ప్రతిభ కనబరిచే పాఠశాలలకు మరియు పాఠశాల విద్యార్థులకు ISRC అవార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా సిద్దిపేట పట్టణానికి మంగళవారం , శుక్రవారం పొడిచిత్త సేకరణ మిగతా రోజులలో (5+2) తడి చెత్త సేకరణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను సిద్దిపేట పురపాలక సంఘానికి Best Practices in SWM అందజేయడం జరిగింది.
✓ పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది.ఐరేని రాజయ్య, గుర్రం శివరాజవ్వ లకు చెత్త సేకరణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను Best Practice in SWM అవార్డును అందజేయడం జరిగింది. మరియు పట్టణంలోని ఇందిరా నగర్ GPHS పాఠశాలకు సైతం ISRC రన్నర్ అప్ అవార్డు అందజేయడం జరిగింది.
✓ సిద్దిపేట పట్టణంలో పాలకవర్గం మరియు సిద్దిపేట పట్టణ ప్రజల సహకారంతో ప్రతి ఇంటి నుంచి తడి ,పొడి ,హానికర చెత్త వేరు చేసి ఇచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతి మంగళవారం, శుక్రవారం పొడిచిత్త సేకరణ ఇతర రోజులలో తడి చెత్త సేకరణ విధానం 100% అమలు చేయుట అందరు సహకారంతో సిద్దిపేటకు దక్కిందన్నారు.
✓పట్టణ ప్రజలలో సైతం బహిరంగ ప్రాంతాలలో చెత్త వేయకుండా త్వరగా అవగాహన కలిగేలా పాలకవర్గం సైతం నడుస్తూ చెత్త ఏరుదాం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరియు ప్లాస్టిక్ నిషేధం, మొక్కల పెంపకం, చెత్త వేరు చేయు విధానం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు పట్టణంలోని పలు పాఠశాలల సైతం ముందుకు వచ్చి జనసాంద్రత అధికంగా ఉండే కూడలిల వద్ద పాఠశాల విద్యార్థులు ఆటపాటల ద్వారా, ఫ్లాష్ మబ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
✓సిద్దిపేట పట్టణాన్ని దేశంలో అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచేందుకు పాలకవర్గం, పట్టణ ప్రజలు, మున్సిపల్ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని సిద్దిపేట పురపాలక సంఘం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన ఎప్పటికప్పుడు ప్రజల సహకారం సైతం అందటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.



