అక్షర న్యూస్ :సామాజిక సేవ,మహిళా చైతన్య కార్యక్రమాలకు గుర్తింపుగా సిద్దిపేటకు చెందిన గాడిపల్లి అరుణారెడ్డికి తెలుగు వెలుగు జాతీయ నంది పురస్కారం దక్కడంతో సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు ఆమెను అభినందించారు.జాతీయ గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాలువా కప్పి సన్మానించారు.ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి సామాజిక కార్యక్రమాలు చేయాలని సూచించారు.భవిష్యత్తులో మరిన్ని అవార్డులు దక్కించుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు.

