అక్షర న్యూస్ :సిద్దిపేట ఏసీపీ మధు, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి రంగదాంపల్లి రోడ్డులో కొంతమంది రైతులు రోడ్డుపై దాన్యం పోసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని సమాచారం రాగా వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సంబంధిత రైతులతో మాట్లాడి రోడ్డుపై దాన్యం పోయవద్దని అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి మధు మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు,
రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక ప్రమాదం జరిగి చనిపోవుచున్నారు.
బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలి, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు, రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు తగిలి చనిపోవడం జరుగుతుంది.
రోడ్లపై ధాన్యం పోయవద్దని
సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని
తెలిపారు.