• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : ఏసీబీకి పట్టుబడ్డ మహబూబ్ నగర్ డిఇఓ రవీందర్..

Bypentam swamy

Nov 7, 2024

అక్షర న్యూస్ :మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు…

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..