అక్షర న్యూస్ :లోక కళ్యాణార్థం సిద్దిపేట లో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం నిర్వహించామని కౌన్సిలర్ దీప్తి నాగరాజు, ఉత్సవ నిర్వాహక కమిటీ నాయకులు లక్ష్మీనాథం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్డులో శివ్వ కాంప్లెక్స్, సుభాష్ రోడ్డు దుకాణ సముదాయాల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వికరణ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా సిద్దిపేటలో కళ్యాణం నిర్వహించామన్నారు. ఆ సీతారాముల చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని…. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించిన వారందరికీ ధన్యవాదాలు.



