• Sat. Apr 19th, 2025

అక్షర న్యూస్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి శుభాకాంక్షలు తెలిపారు..

Bypentam swamy

Feb 26, 2025

అక్షర న్యూస్ :మహా శివరాత్రి వేళ రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినాన మహాశివుని కరుణా కటాక్షాలు దేశ ప్రజలందరిపై ఉండాలని అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి ప్రార్థించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు.

అక్షర న్యూస్: 174 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసిన ఆర్సీబీ…

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, జాగరణ, పూజలు, అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని తెలిపారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని వారు కోరారు. మహాశివుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అక్షర న్యూస్: మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న పవన్.. వీడియో ఇదిగో!