అక్షర న్యూస్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ తమ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడు కావడం విశేషం.
ఆయన భార్య ఉష తెలుగు సంతతికి చెందినవారు. ఉషా చిలుకూరి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేసిన శాంతమ్మకు మనుమరాలు అవుతారు.