• Wed. Mar 26th, 2025

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..

Bypentam swamy

Feb 3, 2025

అక్షర న్యూస్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్ మహాకుంభ మేళలో భక్తజనసంద్రంగా మారింది. నేడు వసంత పంచమి సందర్భంగా చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 17 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సమాచారం. కాగా, వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా.

అక్షర న్యూస్ : సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ…

ప్రయాగ్జ్ మహా కుంభమేళాకు భారీగా భక్తుల పోటెత్తారు. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 1 వరకు సుమారు 33కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది.

వసంత పంచమి పురస్కరించుకొని సోమవారం నాడు 4 నుంచి 6కోట్ల మంది రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో
మరోసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం