• Fri. Apr 18th, 2025

అక్షర న్యూస్ : సృష్టిలో ఒక గొప్ప సృష్టి మహిళ…

Bypentam swamy

Mar 8, 2025

అక్షర న్యూస్ : మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. ఆ చెప్పినది అంతా మహిళ గొప్పతనానికి ఎంతమాత్రమూ న్యాయం చెయ్యలేదు,సరితూగలేదు.

గొప్పతనం గురించి ఎవ్వరూ గొప్పగా కాదుకదా తగినట్లుగా కూడా చెప్పలేదేమో?చెప్పలేరేమో?!
అమ్మ అయింది,తోబుట్టువు ఆయింది,ఆలి అయింది;
అడుగడుగునా మనతోడై నిలిచింది మహిళ.అనురాగం ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది.

అక్షర న్యూస్: ఐఫోన్లను అమెరికాలో ఎందుకు తయారు చేయరంటే…!

మన ఉనికికి మూలం,
మనుగడకు ఆలవాలం మహిళ.
మూగిన జీవనచీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను,
సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ. మనల్ని కదిలించే కావ్యం మహిళ. మానవ జీవితకథకు ఇతివృత్తం మహిళ;
మానవ జీవనకథనానికి గమనం మహిళ.మానవచరిత్రకు ఆత్మ మహిళ.అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్త్వంపరంగానూ, వ్యక్తిత్వంపరంగానూ, ప్రవర్తనపరంగానూ మహిళ ఎంతో విశిష్టమైంది.

మహిళ ఒకదాన్ని స్వీకరిస్తుంది ఆపై దాంతో సృజన చేస్తుంది;ఆ సృజనసూత్రం విశ్వంలోనే అత్యంత అద్భుతమైంది’
అని చైనీస్‌ తత్త్వవేత్త, కవిజుషి వందలయేళ్లక్రితమే చెప్పారు.

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..

సారంలేని ఈ లోకంలో
సారాన్ని ఇచ్చేది మహిళ
అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధశరీరాన్ని మహిళకు ఇచ్చాడు.ఈ రోజు సిద్దిపేట లో మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.