• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల గెలుపు..

Bypentam swamy

Nov 6, 2024

అక్షర న్యూస్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు పలువురు వివిధ రాష్ట్రాల్లో పోటీ పడిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి.. ఇల్లినోయీ నుంచి ప్రతినిధుల సభకు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన విజయం సాధించారు. 

మరోవైపు, నార్తర్న్ వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. సుహాస్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫునే ఎన్నికల బరిలో నిలిచారు. నార్తర్న్ వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి సుహాస్ విజయం సాధించారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ నేత, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హయాంలో సుహాస్ ప్రెసిడెంట్ సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేశారు.

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..

 

అక్షర న్యూస్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2: ది రూల్” సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చూపిస్తోంది..