అక్షర న్యూస్ :హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ మున్సిపాలిటీలో 3,4,5,18 వార్డుల్లో ఒక్కో వార్డుకు 50లక్షల చొప్పున 2 కోట్ల రూపాయలతో రోడ్లు ,మురుగు కాలువల నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖు స్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలోని 20 మున్సిపల్ వార్డుల్లో 50 లక్షల చొప్పున ప్రతి వార్డులలో పనులు చేపట్టడం జరిగిందన్నారు.
ఈరోజు 3,4,5,10 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నమని తెలిపారు. హుస్నాబాద్ లో రీడింగ్ రూమ్స్ పేరుతో అన్ని కులాలకు 45 లక్షల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. బుడగ జంగాలకు కూడా ఇందిరమ్మ పేరు మీద కమ్యూనిటీ హల్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బుడగ జంగాల కాలనీ వద్ద ఇందిరమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆ చౌరస్తా ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
బుడగ జంగాల కాలని కి అవసరమైన రోడ్లు నిర్మిస్తామని అందుకు సంబంధించిన వాటి వివరాలు సేకరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో గాంధీ , అంబేద్కర్ ,నాగరం , కరీంనగర్ చౌరస్తా ల అభివృద్ధికి 50 లక్షల చొప్పున కేటాయించుకున్నామన్నారు.ఎల్లమ్మ చెరువు బండ్ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు టెండర్ ఐపోయి సిద్ధంగా ఉందనీ హుస్నాబాద్ లో పూర్తైన భవనాలు ఏసిపి, ఆర్డీవో , మార్కెట్ , లైబ్రరీ , మున్సిపాలిటీ, కరీంనగర్ 4 లైన్ల రహదారి మొదటి దశకు 75 కోట్లకు కేటాయించడం జరిగిందనీ,150 పడకల ఆసుపత్రి , సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం అభివృద్ధి , మహాసముద్రం గండి అభివృద్ధి , ఆర్టీవో ఆఫీస్ స్థలం సేకరించడం జరిగింది..
స్టేడియం పనులు ఇలా అన్నిటికీ ఒకేసారి ప్రారంభించుకోవడానికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.హుస్నాబాద్ లో వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి రాకుండా డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నామన్నారు.హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.