• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : పెరగనున్న లిక్కర్ ధరలు..

Bypentam swamy

Nov 6, 2024

అక్షర న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. లిక్కర్ రేట్లను కొంతమేర పెంచాలని నిర్ణయించింది. మద్యం ధరలు పెంచొద్దని అనుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు తగ్గట్టుగా మార్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.బీర్‎పై 15 నుంచి 20 రూపాయల వరకు..

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

క్వార్టర్‌ బాటిల్ పై 10 నుంచి 80 రూపాయల వరకు పెంచేలా ప్లాన్చేస్తున్నారు. ఇందులో చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ, ఇతర బ్రాండ్లపై ఎక్కువ పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మద్యం ధరలను యావరేజ్గా 20 నుంచి 25 శాతం మేర పెంచడం ద్వారా.. ప్రతినెలా 500 కోట్లు నుంచి 700 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..