అక్షర న్యూస్ : సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్, ఇండ్లను సందర్శించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు.ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ సత్ప్రవర్తనతో ఉండే రౌడీ పోలీస్ సహకారం ఎల్లపుడూ ఉంటుందని, అలాగే మళ్లీ నేరాలకు పాల్పడే రౌడీ షీటర్ల పై పీడి యాక్ట్ నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రౌడీషీటర్లు పై నిరంతరం నిఘా కొనసాగుతుందని భూకబ్జాలు సెటిల్మెంట్లు లలో తల దూర్చిన, అల్లర్లకు పాల్పడిన, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎటువంటి గొడవలు సృష్టించడం గాని, వేరే వ్యక్తులను రెచ్చగొట్టడం వంటివి చేయకూడదని శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్చకు భంగం కలిగేలాగా ప్రవర్తించ కూడదని శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, గొడవలు, అల్లర్లు, ఆవాంచనీయ సంఘటనలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని మరియు చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడునని, నేరస్తుల కదలికలపై పూర్తి నిఘా పెంచడం జరుగుతుందన్నారు..
సాధారణ ప్రజల లాగా రౌడీ షీటర్లకు వారి కదలికల ఫై మరియు కార్యకలాపాలకు నిఘా ఉంటుందన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం నెలకొల్పి, నేరాల నియంత్రణే లక్ష్యంగా ముందుకు సాగుతాం అన్నారు.