అక్షర న్యూస్ :ముదిరాజుల ఐక్యత తెలపడానికి ముదిరాజ్ ముద్దుబిడ్డలు తమ పేరు చివరన ముదిరాజ్ అనే గర్వంగా చెప్పుకోవాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి నర్సింలు అన్నారు. బుదవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కుల గణన సర్వే లో ముదిరాజ్ లలో వివిధ వర్గాలు ఉన్న కూడా ముదిరాజ్ అని నమోదు చేపించుకోవాలని , ఇప్పుడే ముదిరాజుల సంఖ్య తెలుస్తోందని అన్నారు.
అలాగే ప్రతి ఒక్క ముదిరాజ్ లు ఎక్కడికి వెళ్లిన ముదిరాజ్ అని గర్వంగా చెప్పుకోవాలని, ముదిరాజ్ లలో ఉండే మూతిరాజు, తెనుగా అనే పేర్ల తో గతంలో పిలిచేవారన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తమ పేరు చివర ముదిరాజ్ అని సర్వే లో నమోదు చేసుకున్నట్లు ఐతే ముదిరాజ్ ల సంఖ్య కూడా అధికంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ , నంగునూరు సిద్దిపేట అర్బన్ సిద్దిపేట రూరల్ మండలాల అధ్యక్షులు పిల్లి నారాయణ సిద్ధిరాములు నర్సింలు ,బైరి సాయిచరణ్ ముదిరాజ్ , దుర్గం రాజు , వెంకటేష్ ,నీలం రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.