• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : కొత్త స్పోర్ట్స్ పాలసీపై చంద్రబాబు సమీక్ష..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు.

ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్ లో గ్రేడ్-3 కోచ్ ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

అక్షర న్యూస్ : మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన..

ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని…అన్ని ఆటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని… ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు.

అక్షర న్యూస్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం