• Mon. Dec 8th, 2025

అక్షర న్యూస్ : రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :ఈరోజు సిద్దిపేట కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని చనిపోయిన సంఘటనలు గురించి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారు మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక ప్రమాదం జరిగి చనిపోవుచున్నారు. బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలి, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు, రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు తగిలి చనిపోవడం జరుగుతుంది.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..