అక్షర న్యూస్ :వరిధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదికారులను ఆదేశించారు.శనివారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ గూర్చి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్. చౌహాన్ మరియు ఇతర ఉన్నత అధికారుల తో కలిసి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. సన్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానివి సైతం ప్రారంభించి కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి ఉంచాలి. మిల్లర్ల వద్ద ఎటువంటి ధాన్యం కోతలు జరగవద్దని వచ్చిన ధాన్యం వచ్చినట్లు ధింపుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్ సన్నద్ధం చేయాలని గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.