అక్షర న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిసి కుల గణ సర్వేను విజయవంతం చేయాలనిడీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పూజల హరికృష్ణ చేరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సిద్ధిపేటలోని డిసిసి కార్యాలయంలో వారు మాట్లాడుతూ సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బిసి కులగన సర్వేలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వార్డు అధికారులతో కలిసి సర్వేలో పాల్గొనాలని అన్నారు. బీసీ కుల గణ సర్వే ద్వారా బీసీలు అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కులగన సర్వే ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీసీ కులాలపై వారి కులవృత్తులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అనేక అంశాలపై సర్వే ద్వారా తెలుస్తుందని అన్నారు. గతంలో బీసీ కులగనకు ఎన్నో కమిషన్ వేసిన ఫలితం శూన్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సాహోసపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.