అక్షర న్యూస్ :వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అక్షర న్యూస్ డైరెక్టర్ పెంటం స్వామిహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అన్నారు. దీపావళి దీపాలు మన చీకటి కోరికలు మరియు ఆలోచనలన్నింటినీ నాశనం చేయడానికి, చెడులను నిర్మూలించడానికి, ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని, ఉత్సాహాన్ని అందించే సమయాన్ని సూచిస్తాయని వివరించారు. శాంతి, సౌభ్రాతృత్వం మరియు సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి పండుగలు మనకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పత్రిక ప్రతినిధులకు, విలేఖర్లకు, ఎడిటర్ లకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు..