• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : డాక్టర్ కొత్వాల్ దయానంద్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..

Bypentam swamy

Oct 30, 2024

అక్షర న్యూస్ :వివిధ సంఘాల సంఘసంస్కర్త డాక్టర్ కొత్వాల్ దయానంద్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ పండుగలన్నిటిలో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి అందరు జరుపుకొనే పండుగ దీపావళి. చీకట్లను పారద్రోలి వెలుగును తెచ్చేదానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి మరియు భారతీయ సంస్కృతికి ప్రతీకయే దీపావళి పండుగ. బ్రహ్మ దేవుని వరంతో దేవతలను భాదిస్తున్న నరకాసురుని ఆశ్వీయుజ కృష్ణపక్ష చతుర్ధి నాడు శ్రీకృష్ణభగవానుడు సత్యభామ సమేతుడై వధించి సాదించిన విజయానికి గుర్తుగా ఆ మరుసటి రోజు అమావాస్యనాడు దీపావళి పండుగను ప్రజలు ఆనందంతో జరుపుకొంటారు. ప్రతి ఇంటా వెలుగులతో శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి, బాణ సంచా ప్రమాదం కనుక సాంప్రదాయ బద్దమైన వస్తువులతోనే ఈ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుచూ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..