అక్షర న్యూస్ : శుక్రవారం కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్ధ్యం 0. 3 టీఎంసీలు గాను గోదావరి నదిలో దేవాదుల వద్ద ప్రవహిస్తున్న తీరును బట్టి 0.2 టీఎంసీల నీరు రిజర్వాయర్ లో పంపుచేసి నిల్వ చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతానికి కూడి ఎడమ కాలువలోకి పంపిణీ చేయలేదని నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్ వివరించారు. ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటిని తాగటానికి మాత్రమే వినియోగిస్తామని, వ్యవసాయానికి రిలీస్ చేయట్లేదని రిజర్వాయర్ పైన పరివాహక ప్రాంత రైతులకు జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం తాపస్ పల్లి రిజర్వాయర్ యొక్క కుడి ఎడమ కాలువలను ఆయా గ్రామాల్లో పరిశీలించారు. కొమురవెల్లి మండలంలోని గౌరయపల్లి గ్రామం గుండా వెళ్ళే కాలువను మరియు చేర్యాల మండలం కమలాయపల్లి వద్ద కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ ఎస్ ఈ, ఈఈ, డిఈ లు తదితరులు ఉన్నారు.


