అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ముఖ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో **జి. రోహిత్ ముదిరాజ్** గారిని జై గణేశ భక్తి సమితి **రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జిగా** నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశము,జై గణేశ భక్తి సమితి జాతీయ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు **ఏ. జైన్ కుమార్** గారు మరియు చైర్మన్, జై గణేశ భక్తి సమితి,కె . ఎస్.ఆనంద్ రావు** గారి చేతుల మీదుగా రోహిత్ ముదిరాజ్ గారు నూతన బాధ్యతలను స్వీకరించారు.గత **ఆరు సంవత్సరాలుగా సంస్థలో కొనసాగుతూ, వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన రోహిత్ ముదిరాజ్ గారు**, ఈరోజు మరింత క్రియాశీలమైన బాధ్యతను స్వీకరించడం పట్ల సంస్థ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు **అన్నెం కోటిరెడ్డి – రాష్ట్ర ఉపాధ్యక్షులు**, ** కావేటి.గోవింద్ రాజ్ – రాష్ట్ర కార్యదర్శి** తదితరులు జై గణేశ భక్తి సమితి సభ్యులు, పాల్గొన్నారు.జి. రోహిత్ ముదిరాజ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.జై గణేశ భక్తి సమితి తరపున.

