అక్షర న్యూస్ :జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా
సిద్దిపేట ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులతో సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ వి.లక్ష్మణ్ సోమవారం స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యనానికి పలు రహదారి భద్రత సూచనలు చేయడం జరిగింది.
అందులో భాగంగా
ప్రతి పాఠశాల బస్సులో
ఫస్ట్-ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తప్పనిసరిగా కలిగి ఉండాలని
కిటికీలకు అడ్డంగా గ్రిల్స్,అత్యవసర ద్వారం ఉండాలని ,
ప్రతి బస్సులో తప్పనిసరిగా అటెండర్ అవసరం ,అని డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుప్తున్నారా లేదా అతివేగం తో నడుపుతున్నారా అన్న విషయాన్ని పిల్లల నుండి ప్రతి రోజు సమాచారం సేకరించి డ్రైవర్స్ కి తగు సూచనలను చేయాలని పేర్కొన్నారు. పిల్లల భద్రతకు సంబంధించి ప్రతి యాజమాన్యం అన్ని రహదారి భద్రతా ప్రమాణాలను ,
నిబంధనలను పాటించడం ద్వారా విద్యార్థుల భద్రతను పెంచవచ్చు మరియు ప్రమాదాలను నివారించవచ్చు.
అని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాను సారము పాఠశాల యాజమాన్యం ద్వారా ప్రతి పాఠశాల విద్యార్థి తల్లి తండ్రులకు రహదారి భద్రతకు సంబంధించి ప్రమాణ పత్రం మరియు ప్రతిజ్ఞ పత్రం అందించడం జరిగింది .ఈ కార్యక్రమం లో DTO శ్రీ లక్ష్మణ్ గారి తో పాటు,ఎం వి ఐ శ్రీ పి శంకర్ నారాయణ,ఏ ఎం వి ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్సభ్యులు TRASMA ప్రెసిడెంట్ శ్రీనివాస్ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ జే మల్లారెడ్డి ,TPSA ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి మరియు ఇతర సభ్యుల పాల్గొన్నారు..
సిద్దిపేట మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ పి శంకర్ నారాయణ గారు సాయంత్రం పలు పాఠశాల బస్ లను తనికి చేయడం జరిగింది..
ఇందులో భాగంగా డ్రైవర్స్ లకి
అతి వేగంగా బస్ నడపవొద్దని,పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకోవొద్దని,
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవొద్దని,విధిగా డ్రైవర్ యూనిఫార్మ్ ధరించాలని,సమయాను సారం లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బస్ కి సంబంధించిన ఫిట్నెస్, ఇన్స్యూరెన్స్, పర్మిట్ వంటి పత్రాలను వెంటే ఉంచుకోవాలని సూచించారు..



