• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ :ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు..

Bypentam swamy

Jan 5, 2026

అక్షర న్యూస్ :

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్య తీసుకుంటే ప్రజలు ఎంతో సంతోషించి సంబంధిత అధికారుల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ప్రతి ఒక్క అధికారి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 126 అర్జీలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.