అక్షర న్యూస్ : దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన మల్లుగారి శ్రీనివాస్ (తెలుగు ఉపాధ్యాయుడు) ఇటీవల రెండు కళ్ళు చూపు కోల్పోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థులు మానవీయతతో స్పందించారు.
దుబ్బాక ఆదర్శ విద్యాలయం 2007–08 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు గురువుపై తమ కృతజ్ఞతను చాటుకుంటూ, ఈ రోజు ఆయన కుటుంబానికి రూ.25,000 నగదు సహాయంతో పాటు 50 కిలోల బియ్యంను అందజేశారు.
గురువు అనేది కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాకుండా, విద్యార్థుల జీవితాలకు దారి చూపే మార్గదర్శి అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. గురువు ఆపదలో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడటం తమ బాధ్యత అని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీనివాస్ సర్ త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితం పొందాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో కూడా ఆయనకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే, సమాజంలోని ఇతరులు కూడా ఇలాంటి సమయంలో ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు
ఈ సహాయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పడమటింటి సతీష్,చింత సాయికుమార్, గుజ్జ విజయ్ మరియు కూరపాటి వెంకటేష్ పాల్గొన్నారు.
