అక్షర న్యూస్ :రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షా బంధన్ అని అన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. మహిళా సాధికారత, వారిని కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
రాష్ట్రాభివృద్ధిలో మహిళలంతా భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని.. మహిళల భద్రత, సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని సీఎం పేర్కొన్నారు.
అక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్: సీఎం రేవంత్..
