అక్షర న్యూస్ :మందు మల్లన్న అనే టైటిల్ తో సామాజిక అంశాలు,హాస్య సన్నివేశాలు ప్రధానాంశంగా గంట నిడివి గల ఒక చక్కటి ఇండిపెండెంట్ చిత్రాన్ని చిత్రీకరించబోతున్నట్లు రచయిత, నటుడు, దర్శకుడు,జనానందమే సదానందం గా పేరుగాంచిన ఆర్.ఎస్.నంద తెలిపారు. నేటి ఉదయం వెలిచాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చిత్ర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు, వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల నర్సింగరావు, బొంతుపల్లి గ్రామ సర్పంచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.నంద మాట్లాడుతూ 2006 లో లఘు చిత్ర దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి 30ని,, ల నిడివి గల ఎన్నో సామాజిక, హాస్య, సందేశాత్మక చిత్రాలు నిర్మించినట్లు వాటికి భిన్నంగా నేడు ఒక గంట నిడివి గల ఇండిపెండెంట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.సుమారు 80 శాతం ఈ చిత్ర నిర్మాణం వీణ వంక మండలం బొంతుపల్లి లో మిగతా సినిమా రామడుగు మండలం మోతె గ్రామంలో చిత్రీకరించనున్నట్లు,ఈ సినిమా కూడా హాస్య ప్రధానంగా కొనసాగుతూ, సామాజిక అంశాలను జోడిస్తూ, ఒక చక్కటి సందేశాత్మక చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం విల్సన్, కెమెరా అకిరాజు, ఎడిటింగ్ శ్రీనాథ్ లు అందించనుండగా దర్శకత్వ శాఖలో మల్లికార్జున్,ప్రసాద్ నంగునూరి, రంజిత్ లు వ్యవహరించనున్నారు.ఈ చిత్రం ముఖ్య తారాగణం.. ఆర్.ఎస్.నంద,అంజలి, రమేష్ పయ్యావుల,పూదరి ప్రసాద్, కొల్లూరి ప్రసాద్,పద్మ, విజయ్,బేబీ హన్సి, మాస్టర్ క్రిష్ నటించనుండగా *దూలం తిరుపతి, ఎర్రమరాజు చరణ్ రాజు(ACR)* లు ప్రత్యేక పాత్రల్లో కనువిందుచేయనున్నారు.
అక్షర న్యూస్ : మందు మల్లన్న (ఆర్.ఎస్.నంద ఇండిపెండెంట్ సినిమా)..
