అక్షర న్యూస్ :శ్రీ వాణి సాహిత్య పరిషత్ 12వ వార్షికోత్సవం సందర్భంగా పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం, పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 23న సిద్దిపేట గాంధీచౌక్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు శ్రీ వాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు, కవి-ఉపాధ్యాయులు పెందోట వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆచార్య మట్ట సంపత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా, పెందోట వెంకటేశ్వర్లు సభాధ్యక్షులుగా కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు సాహితీమూర్తులకు ఈ సందర్భంగా పెందోట సాహిత్య పురస్కారాలను అందజేయనున్నారు.
కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం బాలకిషన్, బాలకృష్ణ రావు, నార్లపురం రాములు పాల్గొన్నారు.
సాహితీవేత్తలు, కవులు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..
