బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..
తెలంగాణ

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

అక్షర న్యూస్ : సోమవారం మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
ఆదివారం రోజున పలువురు బాలికలు అస్వస్థతకు గురైన కారణాలను ఆరా తీయ్యగా… డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, మురికి నీరు బయటికి వెళ్లేందుకు సరైన వసతి లేక అక్కడే నిలిచాయాని, సెప్టిక్ ట్యాంక్ సైతం దాదాపు నిండిందని పలు సమస్యలు వలన విద్యార్థులు అస్వస్థకి గురయ్యారని ప్రాథమికంగా అంచనా వేసినట్లు డిఈఓ కలెక్టర్ కి తెలిపారు.
విద్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించామని, శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నామని, చుట్టూ బ్లీచింగ్ చేశామని, సీక్ అయిన ప్రతి ఒకరికి మంచి వైద్యం అందిస్తామని డిఇఓ తెలిపారు.

విద్యాలయంలో ఎన్ని సమస్యలను తమ దృష్టికి ఎందుకు తీసుకోరాలేదని జిల్లా కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేయడం కోసం స్థానిక సర్పంచ్ గ్రామపంచాయతీ అధికారులు అందరూ సహకారంతో మురుగునీరు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..

విద్యాలయ ప్రాంగణంలో ఎక్కడ కూడా వర్షపు నీరు నిలిచే ప్రాంతంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, భవనం పైన వాటర్ ట్యాంకులు తరచూ శుభ్రం చేసుకోవాలని, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేసుకోవాలని, అంటు వ్యాధులు సోకకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, డిఈఓ ను ఆదేశించారు.

స్టోర్ రూమ్ వంట గదిలోకి వెళ్లి విద్యార్థులకు నాణ్యమైన ఆహారపదర్థాలతో రుచికరంగా వండి వేడివేడిగా వడ్డించాలని, ఏదో మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది పెడుతూ విద్యార్థుల అనారోగ్యానికి గురిచేస్తే సహించేది లేదని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని, విద్యాలయ ఉపాద్యాయులు, వంట సిబ్బందిని హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఉందని, వారు తల్లిదండ్రుల నుండి దూరంగా వచ్చి మీ మీద నమ్మకంతో ఇక్కడ చదివిస్తున్నారని ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత మీ పైననే ఉందని, సక్రమంగా విధులు నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కలెక్టర్ వెంట ఇంచార్జీ డిఈఓ రమేష్, సెక్టోరియల్ అధికారి రామస్వామి, కెజీబివి నోడల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీచేయనైనది.