అక్షర న్యూస్ :*జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు* పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా లోని హుస్నాబాద్ పట్టణంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీ యోగేశ్వర్ సింగ్ జాదవ్ నేతృత్వంలో ప్రవేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో మల్లె చెట్టు చౌరస్తా నుంచి అక్కన్నపేట చౌరస్తా వరకి ర్యాలీ నిర్వహించడం జరిగింది.
పాఠశాల పిల్లలు రహదారి నియమ నిబంధనలకు సంబంధించి హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మద్యం తాగి వాహనం నడపరాదనీ , అతివేగం ప్రమాదకరమనే ప్లకార్డ్స్ పట్టుకొని
రహదారి భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని నినదిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా హుస్నాబాద్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ సింగ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలను పాటించాలని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఉద్దేశంతో పాఠశాల పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర సింగారితోపాటు కానిస్టేబుల్ రవీందర్ , హోంగార్డ్ వెంకటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


