అక్షర న్యూస్ :స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన వాకర్స్ ప్రతినిధులను అభినందించిన గ్రామ ప్రజా ప్రతినిధులు
సిద్దిపేట జనవరి 21:
సిద్దిపేట కోమటి చెరువు ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు పుల్లూరి రమేష్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి జీవన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అందరి తోటి కలగొలుపు గా ఉండే వ్యక్తి రమేష్ అని ,అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని గౌరవ అధ్యక్షులు బొమ్మల యాదగిరి ,జైపాల్ రెడ్డి, మెరుగు యాదగిరి అన్నారు. గత సంవత్సరం అనారోగ్యానికి గురికావడంతో వాకర్స్ ప్రతినిధులు లక్ష రూపాయల సహాయం కూడా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లె భాస్కర్ గౌడ్ ,బుర్ర చంద్రం గౌడ్ , ఆంజనేయులు గౌడ్ , కంచర్ల లక్ష్మీనారాయణ , సుధాకర్ , ప్రసాద్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
