అక్షర న్యూస్ :దుబ్బాక పట్టణంలో శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు SCST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు పాల్గొని శ్రీ మార్కండేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
శ్రీ మార్కండేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
పద్మశాలి సమాజ కుల పెద్దలు, నాయకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..



