బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : కవితకు మద్దతుగా ఆమె ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు..

అక్షర న్యూస్ : కవితకు మద్దతుగా ఆమె ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు..

అక్షర న్యూస్ :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నేతలు, ఉద్యమ కార్యకర్తలు భారీగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు.

ఈ సందర్భంగా కవిత తన ఇంటి బాల్కనీలో నిలబడి అందరికీ చేతులు జోడించి అభివాదం చేశారు. తర్వాత కిందకు వచ్చి ప్రతి ఒక్కరినీ పలకరించారు. “ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా?” అంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన వెన్నంటి ఉండి, ఇప్పుడు కష్టకాలంలో కూడా మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె గొంతు కంపిస్తూ “మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మీరు నా బలం” అంటూ మాట్లాడారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఈ సందర్భంలో అక్కడి పరిసర ప్రాంతాలు నినాదాలతో మారుమోగాయి. “జై తెలంగాణ… కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి… తెలంగాణ జాగృతి జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. “ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవితకు అండగా ఉంటాం. తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం” అని నినదించారు.

మరోవైపు, రాజకీయ శక్తిగా అవతరించబోతున్నామంటూ కవిత చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయింది. కవిత రాజకీయ పార్టీని ప్రకటిస్తే… రాష్ట్ర రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.