అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 30-10-2024 ఉదయం 6:00 నుండి 14-11-2024 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుంది. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ గారు సూచించారు.