అక్షర న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.వడ్ల కోనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత లారీలలో సెంటర్ల నుండి వరిధాన్యం గోదాం కు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జి ఎండి. జైనులోద్దిన్ కి తెలిపారు. ఈ ఎఎంసి గోదాంలో మొత్తం 6షెడ్ లకు 1షెడ్ మాత్రమే ఖాళీ గా ఉన్నదని అందులో వరి బస్తాలు వెస్తున్నారని, 5షెడ్ లలో ఎమున్నాయో వివరాలు అందించాలని సుచించారు. అలాగే ధాన్యం ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నందున షెడ్ లను సరిపడినన్ని కాలిగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.లారీలలో తేమశాతం కోలిచే యంత్రంతో వడ్ల తేమశాతం చెక్ చేశారు. గోదాంలో ధాన్యం నిలవచేయడానికి అన్ని సేఫ్టీ మెథడ్స్ పాటించాలన్నారు.
కలెక్టర్ వెంట ఆర్డీఓ రామ్మూర్తి, తహసిల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.