• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లాలో పలు నియోజకవర్గాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు..

Bypentam swamy

Oct 29, 2024

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.పోతారం (ఎస్) లోని ఆర్ కే జిన్నింగ్ మిల్లు ( మీర్జాపూర్ రోడ్డు ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.అనంతరం పత్తి తేమ శాతాన్ని పరిశీలించి తూకం వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,అధికారులు పార్టీ ముఖ్య నేతలు.మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షల తెలిపారు.హుస్నాబాద్ పట్టణంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

ఆయన మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది అన్నారు.కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యవేక్షణ లో దేశ వ్యాప్తంగా కాటన్ కొనుగోలు చేస్తున్నారు.పత్తి మద్దతు ధర పత్తి కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయి.మౌలిక వసతుల కల్పన అడ్మినిస్ట్రేషన్ సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది.కేంద్రంలో ఉన్న మన రాష్ట్ర ప్రతినిధులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 322 పత్తి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలి.ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి , బండి సంజయ్ లకి విజ్ఞప్తి చేస్తున్న.అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు క్రయ విక్రయాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పెంచాలన్నారు.రైతులకు మద్దతుగా ఉండాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..