అక్షర న్యూస్ :రాష్ట్ర ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ అన్నారు.సిద్ధిపేటలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. అధికారం కోల్పోయిన తరువాత బిఅరెస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే 11 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పై లేనిపోని నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డి ఏ లను గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వశక్తి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆర్థిక వనరులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని వారు అన్నారు.