• Wed. Feb 5th, 2025

ఆహారపు అలవాట్లు జీవనశైలి పై అవగాహన కలిగి ఉండాలి:జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

Bypentam swamy

Oct 10, 2024

బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరూ విధులతో పాటు ఆరోగ్యం పై దృష్టి సారించాలి…వనపర్తి బ్యూరో అక్టోబర్ 10 : దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు తమ విధులతో పాటు, ఆరోగ్యం పైనా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాలులో ఐ డి ఓ సి లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి జిల్లా వైద్య శాఖ అధికారి జయచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

డిఎంహెచ్ఓ జయ చంద్ర మోహన్ ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేసారు. ఆరోగ్యం, దాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను, జీవనశైలి, ఆహారపు అలవాట్లను తెలుపుతూ చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. నిత్యం వ్యాయామం కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలమని సూచించారు. ఇప్పుడు మనం అవలంబించే అలవాట్లే వృద్ధాప్యంలో మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని చెప్పారు. శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలన్నారు.అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిత్య జీవితంలో ఉండే ఒత్తిడులను ఎదుర్కొనేందుకు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..