• Mon. Feb 3rd, 2025

2 లక్షల రుణమాఫీ త్వరలో పూర్తి చేస్తాంమంత్రి పొన్నం ప్రభాకర్

Bypentam swamy

Oct 10, 2024

పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత
బతుకమ్మ సాంప్రదాయక పండుగ
ప్రకృతి ఇచ్చిన పూలతోనే బతుకమ్మ ఆడాలి
భీమదేవరపల్లి అక్టోబర్ 10 . పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత తీసుకొని ప్రకృతి ఇచ్చిన పూలతో మహిళలు బతుకమ్మ సాంప్రదాయక పద్ధతిగా పండుగ జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గురువారం మండలంలోని ముల్కనూర్, కొత్తకొండ తదితర గ్రామాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముల్కనూర్ లోని దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సాంప్రదాయక పద్ధతిగా మహిళా సోదరీమణులు జరుపుకుంటున్న సందర్భంగా వారికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. పకృతి ఇచ్చిన పూలతోనే బతుకమ్మలు ఆడుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ఐఏఎస్ ,ఐపీఎస్ , బిఆర్ఎస్ నాయకులు బతుకమ్మలు ఆడటం లేదని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ ఆడటానికి ముందుకు వస్తే తగిన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుండి చేస్తుందని సూచించారు. పండుగలపై రాజకీయం చేయొద్దని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకున్నా ప్రభుత్వం అధికారులతో రాష్ట్రవ్యాప్తంగా పండుగల ఏర్పాట్లను చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అన్న ప్రకారం 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామని సూచించారు. గ్రామాలలో ఇప్పటికే వ్యవసాయ అధికారులు రుణమాఫీ కాని వారి వివరాలు సేకరిస్తున్నారన్నారు . హుస్నాబాద్ నియోజకవర్గంలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరిగే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం కొత్తకొండలో మంత్రి సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్న ధ్యాన మందిరాన్ని పరిశీలించి త్వరలో పూర్తి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి కీ.శే. పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి కుమారులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవి చంద్ర గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ లు దేవస్థానం వద్ద 20 లక్షల వ్యయం తో ధ్యాన మండపం నిర్మాణమునకు శంకుస్థాపన చేశారు . ఈ మందిరాన్ని త్వరలో పూర్తి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య ,కాంగ్రెస్ నాయకులు పిడిశెట్టి కనకయ్య, అశోక్ ముఖర్జీ , కొలుగూరి రాజు ,ఆదరి రవీందర్ ,చంద్రశేఖర్ గుప్తా, ఊస కోయిల ప్రకాష్,కొడకండ్ల సుదర్శన్ రెడ్డి, మంద శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ యాటపోలు రాజమణి శ్రీనివాస్ ,సిద్ధ మల్ల వెంకటేష్, గుర్రాల భాస్కర్ రెడ్డి ,జోడు ముంతల వెంకటస్వామి, పూదరి రవీందర్, లక్ష్మణ్ నాయక్, చెప్పాల ప్రకాష్ ,చింత రాజ్ గౌడ్, కంకల సమ్మయ్య, కొంగుండ సమ్మయ్య, గజ్జల సురేష్, మారెడ్డి తిరుపతిరెడ్డి,దూడల సంపత్ గౌడ్ ,మాడుగుల సంపత్ కుమార్, సిద్ధమల్ల రాజమౌళి, రాయి శెట్టి వణేష్ ,కోతి రవీందర్, షాబుద్దీన్, దసురు నాయక్ తదితరులతో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..