• Tue. Jul 1st, 2025

సెల్కేలాపూర్ కు ఆర్టిసి బస్సు ప్రారంభం,స్వయంగా బస్సును నడిపిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

Bypentam swamy

Oct 10, 2024

వనపర్తి బ్యూరో అక్షర న్యూస్, అక్టోబర్ 10: ఖిల్లా ఘనపురం మండలం మీదుగా సల్కలాపురం గ్రామానికి వనపర్తి ఆర్టిసి బస్సును పున: గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ వెళ్లేందుకు గ్రామీణ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని ఖిల్లా ఘనపురం మండల ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ఖిల్లా గణపురం సల్కెలాపూర్ మీదుగా హైదరాబాద్ కు బస్సు సర్వీసును ఏర్పాటు చేయించారు
గురువారం బస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తానే స్వయంగా బస్సు నడిపారు.
ఎమ్మెల్యేనే స్వయంగా బస్సు నడుపుతున్నాడని తెలుసుకున్న ప్రజలు ఎమ్మెల్యే బస్సు నడపడానికి చూసి ఆశ్చర్యొక్తుయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని గ్రామీణ ప్రజలకు రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

అక్షర న్యూస్ : ప్రజా పాలన ప్రభుత్వం లో పంటలు వేసే కంటే ముందే పంట పెట్టుబడి సహాయం..

అక్షర న్యూస్ : భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.