• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : మర్కుక్ మండల పోలిస్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ సందర్శించారు..

Bypentam swamy

Oct 25, 2024

అక్షర న్యూస్ :మర్కుక్ మండల కేంద్రంలోగల పోలిస్ గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి,

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

పోలీస్ కమిషనర్ ఆప్ పోలిస్ డా. బి. అనురాధ తో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించారు.కొంతకాలంగా ఈ పోలిస్ గృహ సముదాయం వాడకం లేని కారణంగా దీనిని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళశాలగా మార్చేందుకు కావాల్సిన మార్పుల గుర్చి సోషల్ వెల్పేర్, పోలిస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలిస్ డిపార్ట్మెంట్ కి సంభందించిన గృహ సముదాయం లో ఉమెన్ బారెక్స్, మెన్ బారెక్స్, స్టాప్ క్వార్టర్స్ గదులతో పాటు అదనంగా కావలసిన ఇతరత్రా పనులు చేసి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ కు అందించడానికి వారి యొక్క రిక్వెర్మెంట్ ఎం కావాలో తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పరిశీలించామని అన్నారు.కొండపాక మండలంలోని అద్దె భవనం లో ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ పర్మనెంట్ గా దాదాపు 600 మంది విద్యార్థులతో నడపడానికి కావాల్సిన వసతులు అందించి త్వరలోనే ఇక్కడికి షిప్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ వెల్పేర్ వాళ్లు కోరిన విధంగా టాయిలెట్లు, సంపు నిర్మాణం, మిగిలిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారికి త్వరగా ఎస్టిమేట్ వెసి వర్క్ కంప్లీట్ చేయవలసిందిగా తెలియజేశామని, ఈ చుట్టుపక్కల ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, పోలీస్ స్టేషన్, గెస్ట్ హౌస్ లను వాటికి కావాల్సిన బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చతో కుడిన డెవలప్మెంట్ ను అందించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, గజ్వేల్ అర్డిఓ బన్సీలాల్, సోషల్ వెల్పేర్ జోనల్ అధికారి ప్రత్యూష, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ సవిత, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, మర్కుక్ ఎస్ఐ దామోదర్, మరియు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..