• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కొట్టేపించిన సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్…

Bypentam swamy

Oct 25, 2024

అక్షర న్యూస్ :రోడ్డు ప్రమాదాల నివారణ గురించి సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ కె ఆర్ వారి సహకారంతో రాజీవ్ రహదారి నర్సాపూర్ చౌరస్తా నుండి రంగీలా దాబా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను ట్రిమ్మింగ్ మిషన్ మరియు వర్కర్స్ తో క్లీన్ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను వచ్చిపోయే వాహనాలు కనబడకుండా ఉండవాటిని తీసివేయడం జరిగిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా బుషెస్ చెట్లపొదలు ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంవల్ల ప్రమాదాలు నివారించడానికి రాజీవ్ రహదారిపై ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..