అక్షర న్యూస్ :సిద్దిపేట పట్టణం లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ రోడ్డు శ్రీనివాస్ థియేటర్ వద్ద సిద్దిపేట ఏసిపి జి మధు, జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా సిద్దిపేట ఏసిపి జి మధు, మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఈరోజు సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని. పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ, నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా ఉండటానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ నరసింహారావు, మరియు విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.