• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు..

Bypentam swamy

Oct 25, 2024

అక్షర న్యూస్ : జిల్లాలో పలు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.శుక్రవారం జిల్లాలోని
బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం లో గల వరి ధాన్య కొనుగోలు కేంద్రం.
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వరి ధాన్య కొనుగోలు కేంద్రంలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సెంటర్లలో సరిపడినన్ని గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు, తేమశాతం కొలిచే యంత్రాలు, వరి తాలు తీసే యంత్రాలు, బరువు తుకే యంత్రాలు ప్రతిది సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ప్రతి సెంటర్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి.రైతులను గుర్తించేందుకు వీలుగా ఐరిస్ స్కానర్ విధానం గురించి కేంద్ర ఇన్చార్జిలకు మరియు సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలి. హమాలీలు ఎల్లప్పుడూ కొనుగోలు కేంద్రాల్లో ఉండి ధాన్యాన్ని వెంట వెంటనే లోడ్ చేయాలి. వరి కోను గోలు కేంద్రాల్లోని నేరుగా ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది వ్యవసాయ క్షేత్రాలలో ఆరబెట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని సూచించారు.
రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలలో చివరి గింజ వరకు విజయవంతంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట పిడి డిఆర్డిఏ జయదేవ్ ఆర్య, ఏపిఎంలు, ఆయా కేంద్రాల ఇన్చార్జులు, తదితరులు హాజరయ్యారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..